అక్రమ సంబంధం.. యువకుడి అనుమానాస్పద మృతి

అక్రమ సంబంధం.. యువకుడి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దమ్మాయిగూడ మ్యూనిసిపలిటీలోని, భవాని నగర్ లో వెంకన్న అనే 26 సంవత్సరాల యువకుడు చనిపోయాడు.  ఇంటి యజమానితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఇంటి యజమాని మనుషులు హతమార్చినట్టు మృతుని బంధువుల ఆరోపిస్తున్నారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం  కేసు నమోదు చేసుకొని దర్వ్యాప్తు చేపట్టారు. మాకు న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని ఇక్కడి నుండి తెసేదే లేదని బంధువులు డిమాండ్ చేశారు.