మమతా బెనర్జీ నామినేషన్ పై సువేందు అధికారి అభ్యంతరం

మమతా బెనర్జీ నామినేషన్ పై సువేందు అధికారి అభ్యంతరం

పశ్చిమబెంగాల్  సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్ పై ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. మమతపై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని... వాటిని అఫిడవిట్ లో ఆమె తెలపలేదని అన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని అన్నారు. 2018లో ఐదు FIR లు, CBI ఒక FIR దాఖలు చేసిందని అన్నారు సువేందు.

FIR లను తొలగించాలని కోరుతూ మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారని... అయితే ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందని చెప్పారు సువేందు అధికారి. ఆమెపై ఉన్న కేసులకు సంబంధించి సాక్ష్యాలను కూడా ఈసీకి సమర్పించానని... ఈ అంశంపై ఈసీ సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.