స్వాతిముత్యం ఓ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్

స్వాతిముత్యం ఓ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్

టైటిల్:  స్వాతిముత్యం, కాస్ట్: గణేష్, వర్ష బొల్లమ్మ, నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, దివ్య శ్రీపాద, డైరెక్టర్: లక్ష్మణ్ కె కృష్ణ, రన్ టైం: 2గం. 2 ని.
ప్లాట్ ఫాం: ఆహా, లాంగ్వేజ్: తెలుగు

బాలమురళీకృష్ణ (గ‌‌ణేశ్‌‌) ఒక గవర్నమెంట్ ఉద్యోగి. పెండ్లి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓసారి పెండ్లి చూపుల్లో స్కూల్ టీచర్ భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు. వాళ్ల పెండ్లి పీటల వరకు వస్తుంది. అయితే కాసేపట్లో పెండ్లి అన‌‌గా శైలజ (దివ్య శ్రీపాద) ఓ తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి ‘నీ కొడుకే’ అంటూ హీరో చేతిలో పెడుతుంది.  దీంతో పెండ్లి ఆగిపోతుంది. ఇంత‌‌కీ ఆ శైలజ ఎవరు? ఆ బాబు నిజంగా బాలకు పుట్టిన బిడ్డేనా?  బాల, భాగ్యలక్ష్మి పెండ్లి జ‌‌రిగిందా? లేదా? అనేది మిగ‌‌తా క‌‌థ‌‌.

స్వాతిముత్యం ఓ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్. బాల అనే యువ‌‌కుడి పెండ్లి కష్టాల చుట్టూ తిరిగే కథ. ‘స‌‌రోగ‌‌సీ’ అనే సెన్సిటివ్ సబ్జెక్ట్‌‌ను పెండ్లికి ముడిపెట్టి సినిమా అంతా నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అమాయకత్వంతో ఉండే  బాల క్యారెక్టర్, తన ఆఫీసులో జరిగే సీన్స్, బాల తల్లిదండ్రుల చాదస్తం.. ఇవన్నీ ఆడియెన్స్‌‌కు నవ్వు తెప్పిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కొత్తగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినా సీన్లు మాత్రం కొత్తగా, హ్యూమరస్‌‌గా ఉంటాయి. హీరోహీరోయిన్లు ఇద్దరూ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. రావు రమేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ లాంటి  కమెడియన్ల టైమింగ్ సూపర్.  సినిమాటోగ్రఫీ, బ్యాక్‌‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి.  ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌‌గా ఉన్నాయి. చివరిగా వీకెండ్‌‌కు ఫ్యామిలీ అంతా కలిసి చూడడానికి స్వాతిముత్యం సరైన సినిమా.