ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?

ఫేస్ బుక్ షేర్లు 10 శాతం పడిపోయాయి..ఎందుకో తెలుసా?

ఏడాదిన్నర కాలంగా కోల్పోయిన షేర్ల పునరుద్దరణకు Meta చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గురువారం (ఏప్రిల్25) ఒక్క రోజే మెటా షేర్లు 15 శాతానికి పడిపోయాయి. రోజువారీ ట్రేడ్ ముగిసే సమయానికి షేర్ ధరలు 441.38యూఎస్ డాలర్లుగా ఉంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా దాని AI స్ప్లర్జ్ కు చాలా సమయం పడుతుందని కంపెనీ సంకేతాలు ఇవ్వడంతో పెద్ద టెక్ స్టాక్ లలో అమ్మకానికి దారి తీసింది. రాయిటర్స్ ప్రకారం.. కంపెనీ కేవలం ఒక రోజులో దాని వాల్యుయేషన్ నుంచి 170 బిలియన్ డాలర్లను కోల్పోయింది. 

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ బూమ్ కొనసాగుతోంది. ప్రధాన కంపెనీలన్నీ ఈ రంగంలో ప్రవేశించాయి. మెరుగైన ఫలితాలను సాధించే మార్గాలను ఏర్పాటు చేయకుండా కంపెనీ మరోసారి వెనకడుగు వేస్తుందని చాలా మంది పెట్టుబడిదారులు భయపడి ఒకేసారి షేర్ల అమ్మకాలకు దిగారు. చాలామందికి ఇది మెటావేర్స్ లో చేసిన స్పర్జ్ ను గుర్తు చేస్తుంది. మరోవైపు AI రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ లాంటి ఇతర సంస్థలు కూడా షేర్ల కూడా 2.45 శాతం లోటుతో USD 399.04 వద్ద ముగిసింది.