100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు

100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు
  • మళ్లీ పేపర్ బ్యాలెట్లను వాడటం వీలుకాదు
  • పిటిషన్లంటినీ కొట్టేస్తూ తీర్పిచ్చిన సుప్రీం కోర్టు 
  • ఈసీకి పలు సూచనలు చేసిన ధర్మాసనం

ఢిల్లీ : ఈవీఎమ్ లలో పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ల స్లిప్లను వంద శాతం సరిపోల్చాల ని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లతో వంద శాతం క్రాస్ వెరిఫికేషన్ కుదరదని తేల్చి చెప్పింది. ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లను వాడాలన్న అభ్యర్థనను కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఈ వ్యవ హారంపై దాఖలైన పిటిషన్లపై ఇటీవల సు ప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ప్రొటోకాల్లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నలు సంధించింది. ఈసీ నుంచి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం..

పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలు వరించింది. 'వీవీప్యాట్ లు వందశాతం సరి పోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు. కానీ, ఈవీఎంలు వీవీ ప్యాట్లకు సంబంధించి రెండు సూచనలు చేస్తున్నాం. సింబల్ లోడింగ్ తర్వాత ఎస్ ఎల్ యూలు సీల్ చేసి 45 రోజులు భద్రంగా ఉంచండి. ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితే ఈవీఎంలు పరి శీలించుకోవచ్చు. ఇంజినీర్ల బృందంతోనూ పరిశీలన చేసుకోవచ్చు. ఈవీఎంల పరిశీ లనకు అభ్యర్థులకు 7 రోజుల గడువు ఇవ్వాలి. అంతేగానీ మళ్లీ బ్యాలెట్ లు పెట్టా అని చెప్పలేం' అని తీర్పు ద్వారా దర్మాసనం అభిప్రాయ పడింది.