V6 News

షెఫాలీ వర్మ, స్మృతి మెరుపులు..విండీస్ పై భారత్ విజయం

షెఫాలీ వర్మ, స్మృతి మెరుపులు..విండీస్ పై భారత్ విజయం

సెయింట్‌‌ లూసియా : ఓపెనర్లు షెఫాలీ వర్మ (49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 73), స్మృతి మంధాన (46 బంతుల్లో 11 ఫోర్లతో 67) ధనాధన్‌‌ హాఫ్‌‌ సెంచరీలతో..  శనివారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20లో ఇండియా 84 రన్స్‌‌ తేడాతో వెస్టిండీస్‌‌ విమెన్స్‌‌పై గెలిచింది. దీంతో  ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో టీమిండియా 1–0తో లీడ్‌‌లో నిలిచింది.  టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 రన్స్‌‌ చేసింది. షెఫాలీ, స్మృతి తొలి వికెట్‌‌కు 143 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఇండియా మహిళల జట్టుకు ఏ వికెట్‌‌కైనా టీ20ల్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. షెఫాలీ, స్మృతి స్వల్ప తేడాలో వెనుదిరిగినా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (21 నాటౌట్‌‌) చివర్లో విలువైన పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌‌లో ఓవర్లన్నీ ఆడిన విండీస్‌‌ 9 వికెట్లు కోల్పోయి 101 రన్స్‌‌ మాత్రమే చేసింది. షర్‌‌మైన్‌‌ క్యాబెల్లీ (33) టాప్‌‌ స్కోరర్‌‌. ఇండియా బౌలర్లలో శిఖా పాండే, రాధా యాదవ్‌‌, పూనమ్‌‌ యాదవ్‌‌ రెండేసి వికెట్లు తీశారు.