టాటా స్టీల్​ లాభం రూ.1,514 కోట్లు

టాటా స్టీల్​ లాభం రూ.1,514 కోట్లు

న్యూఢిల్లీ:  టాటా స్టీల్ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్​లో రూ.1,514 కోట్ల  నికర లాభాన్ని  ప్రకటించింది. పోయిన ఏడాది ఇదే క్వార్టర్​లో నమోదైన రూ.11,918 కోట్ల లాభంతో పోలిస్తే ఇది చాలా రెట్లు తక్కువగా ఉంది.   ఈసారి సుమారు రూ.3,000 కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు.  అయితే వారి అంచనాలను కంపెనీ అందుకోలేకపోయింది.   

మొత్తం ఆదాయం  0.8 శాతం తగ్గి రూ.59,877.52 కోట్లకు చేరుకుంది.  ఏడాది క్రితం ఇదే కాలంలో  రూ.60,387.13 కోట్లు ఉంది.  ఇబిటా  రూ.6,271 కోట్లు ఉంది.  కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, తమ కంపెనీ భారతదేశంలో ఆశించిన అమ్మకాలను సాధించిందని టాటా స్టీల్  సీఈఓ  ఎండీ టీవీ నరేంద్రన్ అన్నారు. టాటా స్టీల్‌లో ఏడు లిస్టెడ్,  అన్‌లిస్టెడ్ ఎంటిటీల విలీన ప్రతిపాదనను తమ బోర్డు ఆమోదించిందని ఆయన వివరించారు.