భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు

భారీగా తగ్గిన ఫారెక్స్ నిల్వలు

న్యూఢిల్లీ: ఈ నెల 19తో ముగిసిన వారంలో మనదేశ ఫారెక్స్ నిల్వలు 2.282 బిలియన్ డాలర్లు క్షీణించి 640.334 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తాజా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డేటా తెలిపింది.  వరుసగా రెండో వారంలోనూ నిల్వలు తగ్గాయి. అంతకుముందు వారంలో వీటి విలువ 5.401 బిలియన్ల డాలర్లు తగ్గి 643.162 బిలియన్లకు చేరుకుంది. ఈ నెల ఐదో తేదీతో ముగిసిన వారానికి   విదేశీ మారక నిల్వలు 648.562 బిలియన్ల ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని తాకాయి. 

సెప్టెంబర్ 2021లో కూడా, దేశం  ఫారెక్స్ నిల్వల విలువ గరిష్టంగా 642.453 బిలియన్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లలో సమస్యల కారణంగా ఏర్పడిన ఒత్తిళ్ల మధ్య రూపాయిని రక్షించడానికి సెంట్రల్ బ్యాంక్ ఫారిన్​కరెన్సీని అమ్మడంతో నిల్వలు దెబ్బతిన్నాయి.