క్యూట్ పరీక్ష ఆలస్యం : టెక్నికల్ సమస్యలే కారణమన్న NTA..స్టూడెంట్లకు పూర్తి టైమ్ ఇచ్చామని వెల్లడి

క్యూట్ పరీక్ష ఆలస్యం : టెక్నికల్ సమస్యలే కారణమన్న NTA..స్టూడెంట్లకు పూర్తి టైమ్ ఇచ్చామని వెల్లడి
  • మండుటెండలో గంటల తరబడి స్టూడెంట్ల నిరీక్షణ

 న్యూఢిల్లీ: క్యూట్​యూజీ 2026 ఎగ్జామ్ శనివారం దేశవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో గంటల తరబడి ఆలస్యంగా మొదలైంది. దీంతో లక్షలాదిమంది విద్యార్థులు ఎగ్జామ్​సెంటర్ల వద్ద మండుటెండలో నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురు విద్యార్థులు తమను సెంటర్​లోనికి వెళ్లనివ్వడం లేదని.. ఏం జరిగిందో కూడా చెప్పడంలేదని, ఎగ్జామ్ టైమ్ ​అవుతున్నా తమను గేట్ల వద్దే ఎండలో నిలిపేశారని సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ఇబ్బంది పడుతున్న స్టూడెంట్ల వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. 

నీట్, సీబీఎస్‌‌‌‌ఈ వివాదాలకు తోడు ఈ ఎగ్జామ్​ విషయంలో గందరగోళంపై నెలకొనడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాయి. అయితే, ఈ పరీక్షలకు టెక్నికల్​సర్వీసెస్​ అందిస్తున్న టీసీఎస్​లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని నేషనల్​టెస్టింగ్​ఏజెన్సీ(ఎన్​టీఏ) వెల్లడించింది. సమస్యను పరిష్కరించి ఎగ్జామ్​ మొదలుపెట్టినట్లు తెలిపింది. 

టెక్నికల్ ​గ్లిచ్​ వల్ల ఎగ్జామ్ ​కొన్ని గంటలు ఆలస్యమవడంపై టీసీఎస్ సీ ఈవో కృతివాసన్ క్షమాపణ చెప్పారు. సమస్యను గుర్తించి పరిష్కరించినట్లు తెలిపారు. ఎన్​టీఏ మధ్యాహ్నం సెషన్ వేళలు మార్చింది. ఉదయం సెషన్ ఎగ్జామ్ ​ఆలస్యమైనప్పటికీ పరీక్ష రాసే విద్యార్థులకు పూర్తి సమయం కల్పించినట్టు చెప్పారు. అలాగే సహాయం కోసం హెల్ప్‌‌‌‌లైన్ నంబర్, cuet-ug@nta.ac.in మెయిల్ అందుబాటులో ఉంచారు. 

సెంట్రల్​యూనివర్సిటీలతోపాటు పలు కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఎన్‌‌‌‌టీఏ సీయూఈటీ పరీక్షను నిర్వహిస్తుంది. వివిధ దశల్లో ఉండే ఈ పరీక్ష మే 11 నుంచి మే 31 వరకు జరగనుంది. గతంలో క్యూట్ ఎగ్జామ్​ నిర్వహణలో పలు సమస్యలు, ఇబ్బందులు తలెత్తాయి. కాగా, క్యూట్​ యూజీ ఎగ్జామ్ ​ఆలస్యంపై ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘ఫస్ట్ నీట్, తర్వాత సీబీఎస్‌‌‌‌ఈ, ఇప్పుడు క్యూట్’’ అని మాజీ ఢిల్లీ సీఎం ఆతిశీ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌పై విమర్శలు గుప్పించారు.