రెండేండ్లు..  రూ.84 వేల కోట్లు..లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రానికి రికార్డ్ పెట్టుబడులు

రెండేండ్లు..  రూ.84 వేల కోట్లు..లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రానికి రికార్డ్ పెట్టుబడులు
  • టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ ఏడో బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడి
  • పటిష్టమైన నాయకత్వం, వ్యవస్థల వల్లే ఇది సాధ్యమైంది: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: "లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. గత రెండేండ్లలోనే లైఫ్ సైన్సెస్​రంగంలో రూ.84 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి" అని అధికారులు చెబుతున్నారు.

గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ (టీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్) ఏడో బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత పదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధిపై చర్చించారు. రెండేండ్లలో ఈ రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధి నమోదైందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

నిర్ణయాత్మకమైన నాయకత్వం, పటిష్టమైన వ్యవస్థ, విధానపరమైన నిర్ణయాలు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడానికి కారణమైందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు రాష్ట్రానికి రావడం వల్ల నూతన పరిశోధనలు, వృద్ధికి దోహదం చేసిందని పేర్కొన్నారు. నెక్స్ట్ జెనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. గ్రీన్ ఫార్మా సిటీలో ఇప్పటికే చాలా పెట్టుబడులు వచ్చాయని, అందులో ఇప్పటికే కొన్ని కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు.

ఎంవోయూలు కుదిరిన మరో రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, 2016 నుంచి రాష్ట్ర లైఫ్​సైన్సెస్ సెక్టార్ వృద్ధి మూడు రెట్లు పెరిగినట్టు బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించారు. బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ వంటి వాటిల్లో ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని వివరించారు. ప్రపంచంలోని టాప్ 10 సంస్థల్లోని 9 సంస్థలకు చెందిన టెక్నాలజీ ఇన్నొవేషన్ సెంటర్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఏర్పాటయ్యాయని, అమెరికా తర్వాత ఆ ఘనత సాధించింది హైదరాబాదేనని బోర్డు సభ్యులు పేర్కొన్నారు. కాగా, లైఫ్ సైన్సెస్ బోర్డుకు కొత్త సీఈవోగా సర్వేశ్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించారు. ఆ బాధ్యతల్లో ఉన్న శక్తి నాగప్పన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లైఫ్ సైన్సెస్ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. 

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో రూ.29 వేల కోట్లే..

గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగానికి వచ్చిన పెట్టుబడులు రూ.29 వేల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2023లో నాటి ప్రభుత్వం విడుదల చేసిన ఇండస్ట్రియల్ గ్రోత్ రిపోర్టులోనే ఈ విషయాలు వెల్లడయ్యాయి. అప్పటికి వెయ్యికిపైగా లైఫ్ సైన్సెస్ పరిశ్రమలు రాష్ట్రంలో కార్యకలాపాలను నిర్వహిస్తుండగా.. దాదాపు 4.5 లక్షల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే 800కుపైగా సంస్థలు ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒపెల్లా హెల్త్ కేర్, అమెరికాకు చెందిన ట్రెడెన్స్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ ప్రొపెల్లెంట్, ఇండొనేషియాకు చెందిన యానిమల్ వ్యాక్సిన్ కంపెనీ వ్యాక్సిండో, కేంబ్రిడ్జ్ ఐసోటోప్ లేబొరేటరీస్ ఆర్ అండ్ డీ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ రెండేండ్లలో వచ్చిన పెట్టుబడుల విలువ రూ.84 వేల కోట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.