ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన నా దీక్ష ఆగదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన లక్ష్మణ్ ను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్త నిమ్స్ కు తరలించారు. ఇంటర్ విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు లక్ష్మణ్. విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రేపు ప్రగతి భవన్ ముట్టడి, మే 2న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు లక్ష్మణ్. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

