గుంటూరు: పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సమేతంగా తెలంగాణ సీఎం ఈ పెళ్లికి వెళ్లారు.
గుంటూరు సిటీలోని శ్రీకన్వెన్షన్లో బుధవారం రోజు.. ధూళిపాళ్ల నరేంద్ర చిన్న కుమార్తె వైదీప్తి, రామ్ వివాహం జరిగింది. ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేష్ సరదాగా ముచ్చటించుకున్నారు.
పెళ్లి వేడుకలో మంత్రి నారా లోకేష్, నవ వధువు అయిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తెకు ఆసక్తికర సంభాషణ జరిగింది. మహిళా రిజర్వేషన్ వస్తుందని, ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉండమని ధూళిపాళ్ల కుమార్తెతో మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఇందుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బదులిస్తూ.. ‘‘మాకే ఎర్త్ పెడితే ఎలా బాబూ’’ అని నారా లోకేష్తో అనడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా అక్కడ ఉన్న వాళ్లంతా నవ్వేశారు. ధూళిపాళ్ల కుమార్తె వివాహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
