కానిస్టేబుల్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

కానిస్టేబుల్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

హైదరాబాద్: కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష  ప్రిలిమినరీ ‘కీ’ని రిక్రూట్ మెంట్ బోర్డ్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆదివారం నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ‘కీ’ని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం అంటే ఈనెల 31న ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు అభ్యంతరాలను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు తగిన ఆధారాలను విడివిడిగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని వారు కోరారు.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 38 పట్టణాలలో  ప్రాథమిక రాత పరీక్ష జరుగగా మొత్తం 6 లక్షల 61వేల 198 మందికి గాను 6లక్షల 3వేల 955 (91.34శాతం) మంది హాజరయ్యారు.