హైదరాబాద్: తెలంగాణ క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించారు. HCA నిర్వహిస్తున్న TG 20 లీగ్కు చట్టబద్దత లేదని పిటిషన్ దాఖలు చేశారు. TG 20 లీగ్ వెంటనే ఆపాలని పిటిషన్ దాఖలు చేసిన క్రికెటర్లు కోర్టును అభ్యర్థించారు. TG20కి చట్టబద్దత లేదని ప్రకటించాలని కోరారు. క్రికెటర్ అంబటి రాయుడు, TG 20 గవర్నింగ్ కౌన్సిల్ తమను మోసం చేసిందని క్రీడాకారులు పిటిషన్లో పేర్కొనడం గమనార్హం.
టీజీ 20 లీగ్ తొలి సీజన్ పోటీలు జూన్ 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.
విన్నర్ టీమ్ కి రూ. కోటి ప్రైజ్ మనీ:
ఈ లీగ్ మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ప్రతి టీమ్ మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది (రౌండ్-రాబిన్ ఫార్మాట్).. ప్రైజ్ మనీ కూడా భారీ ప్రకటించారు.
- కప్ గెలిచిన టీమ్కు (Winner): రూ.1 కోటి
- రన్నరప్ (Runner-up) కి: రూ.50 లక్షలు
- 3, 4 ప్లేస్లలో నిలిచే జట్లకు: రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ
