- నేటి నుంచి ఆగస్టు 6 వరకూ అప్లికేషన్లు
- ఆగస్టు 13, 14 తేదీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ ఫార్మసీ) కోర్సులో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అడ్మిషన్లకు జూలై 24 నుంచి ఆగస్టు 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బోర్డు సెక్రటరీ పుల్లయ్య గురువారం తెలిపారు.
రూ.వంద ఆలస్య రుసుముతో ఆగస్టు 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టు 11న ర్యాంకులు/మెరిట్ జాబితా విడుదల చేసి, ఆగస్టు 13, 14 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కోర్సులో చేరాలనుకునే వారు ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీలో కోర్సుల్లో పాసైన వారై ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల నుంచి12వ తరగతి పూర్తి చేసిన వారు, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సమానమైన కోర్సులు చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారులు వెల్లడించారు.
