తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎప్ సెట్ (EAPCET) ఫలితాలు విడుదలయ్యాయి. 2026 మే 17న ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల కోసం  వెబ్‌‌‌‌సైట్ https://eapcet.tgche.ac.in లో చూడాలని ఈ సందర్భంగా చెప్పారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కూకట్‌‌‌‌పల్లిలోని జేఎన్‌‌‌‌టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. 

ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లలో కలిపి మొత్తం 2,82,195 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  .ఇంజనీరింగ్ విభాగం లో 1,97,242 మంది విద్యార్థులు పరీక్షా రాయగా 1,44,704 మంది పాస్ అయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 84,954మంది విద్యార్థులు పరీక్ష రాయగా 73,294 పాస్ అయినట్లు వెల్లడించారు. 

అగ్రికల్చర్ అండ్  ఫార్మసీ స్ట్రీమ్  స్టూడెంట్లకు మే 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 90,977 మందికి గాను 84,954 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు  మే 9 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,97,241మంది హాజరయ్యారు. ఫలితాలను వెబ్‌‌‌‌సైట్ https://eapcet.tgche.ac.in లో.. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని  ఎప్ సెట్ కన్వీనర్  ప్రొఫెసర్  విజయకుమార్ రెడ్డి చెప్పారు. 

  • TG EAPCET - 2026 ఇంజనీరింగ్ విభాగం టాపర్స్ వివరాలు

* ర్యాంక్ 1 : ఎం. రుషి – 156.63 మార్కులు
* ర్యాంక్ 2 : బెజుగం అన్షుల్ – 148.70 మార్కులు
* ర్యాంక్ 3 : మరాక వంశీధర్ రెడ్డి – 147.05 మార్కులు
* ర్యాంక్ 4 : జొన్నల రోషన్ మందీప్ రెడ్డి – 144.44 మార్కులు
* ర్యాంక్ 5 : అడుల సౌనికిత్ – 143.30 మార్కులు
* ర్యాంక్ 6 : మల్లవరపు ఆస్నా – 143.28 మార్కుల
*  ర్యాంక్ 7 : వివాన్ శరద్ మహేశ్వరి – 142.92 మార్కులు