జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోలో 97 మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లకు ప్రమోషన్

జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోలో 97 మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లకు ప్రమోషన్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: తెలంగాణ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోలో పనిచేస్తున్న 97 మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లకు పదోన్నతులు కల్పిస్తూ సంస్థ సీఎండీ హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెలికాం విభాగాలకు చెందిన 22 మందిని అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు (ఏఈ)గా, 75 మందిని అదనపు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లు (ఏఏఈ)గా పదోన్నతి కల్పించారు. వీరిలో 40 మందిని యాదాద్రి థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వైటీపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కు బదిలీ చేశారు. పదోన్నతి పొందిన ఇంజినీర్లు కేటాయించిన స్థానాల్లో వీలైనంత త్వరగా బాధ్యతలు స్వీకరించాలని సీఎండీ ఆదేశించారు.