2015 నుంచి ఇప్పటిదాకా.. టెన్త్ ఫెయిలైనవారందరికీ సప్లిమెంటరీ రాసే చాన్స్

2015 నుంచి ఇప్పటిదాకా.. టెన్త్ ఫెయిలైనవారందరికీ సప్లిమెంటరీ రాసే చాన్స్
  • ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగం 

హైదరాబాద్, వెలుగు: ఏండ్ల తరబడి పదో తరగతి గట్టెక్కలేక చదువు ఆపేసిన విద్యార్థులకు సర్కారు మరో అవకాశం కల్పించింది. 2015 నుంచి ఇప్పటివరకు టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన పాత విద్యార్థులందరూ వచ్చే జూన్ లో జరిగే అడ్వాన్స్‌‌‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని ప్రకటించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో సీసీఈ పద్ధతి అమల్లోకి వచ్చిన 2015 నుంచి పరీక్ష రాసి ఫెయిలైన విద్యార్థులందరూ ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.  సాధారణంగా ఆ ఏడాది ఫెయిలైన వారే సప్లిమెంటరీకి హాజరవుతుంటారు, కానీ వేలాది మంది పాత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సర్కార్ ఈ వెసులుబాటు కల్పించింది.