మహిళా ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బాలూనాయక్

మహిళా ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు :  మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం  పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని గౌరికుంట తండా, గుడితండా గ్రామాల్లో రూ. 20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీకి అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం కొండమల్లేపల్లి మండల మహిళా సమాఖ్యా భవనంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలతో పాటు సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు అలర్ట్​గా ఉండాలని ఆదేశించారు. ఆ తర్వాత దేవరకొండ మండలం మైనంపల్లి శివారులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ మహిళా కళాశాలలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవలో పాల్గొన్నారు. 

పశుసంరక్షణ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  పశుసంరక్షణ సేవలపై దృష్టి పెట్టాలని మహబూబ్​నగర్​ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పశువైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో  పశుసంవర్ధక శాఖపై  నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కృత్రిమ గర్భధారణ, టీకాలు, డీ-వార్మింగ్, గడ్డి విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో మూడు నెలల్లో టార్గెట్​ పూర్తి చేయాలని పశువైద్య అధికారులను ఆదేశించారు.

 వెటర్నరీ వైద్యులు, గోపాలమిత్రలు, పారా వెటర్నరీ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటూ శాస్త్రీయ పశువైద్య సేవలపై ప్రచారం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 75 శాతం సబ్సిడీతో ఇస్తున్న గడ్డి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిథిలావస్థకు చేరిన పశువైద్యశాలల భవనాలకు రిపేర్లు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.   
స్త్రీనిధి బకాయిల 
వసూలుకు ఆర్​ఆర్ యాక్టు
వనపర్తి/రేవల్లి, వెలుగు : వనపర్తి జిల్లాలో మహిళలు  స్త్రీనిధి పథకంలో భాగంగా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని, రుణాలు దుర్వినియోగం చేస్తే  ‘ఆర్ఆర్’ యాక్ట్ కింద సులు పెడతామని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్​ లో స్త్రీ నిధి జోనల్ మేనేజర్ టీవీ  రవి కుమార్ ఆధ్వర్యంలో ఎపీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని రుణాలు గ్రౌండింగ్ చేశారు, రికవరీ ఎంత చేశారు.. అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల స్కూల్ యూనిఫాంల కుట్టుపనిలో టైలర్లు పాఠశాలలకు వెళ్లి కొలతలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనెల15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం గోపాల్‌‌‌‌పేట మండలం తాడిపర్తిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్‌‌‌‌పామ్ మొక్కలు నాటారు. రైతులు వరికి బదులుగా దీర్ఘకాలిక లాభాలను అందించే ఆయిల్‌‌‌‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.