తెలంగాణ కార్మికులకు రాష్ట్రప్రభుత్వం వరాలజల్లు కురిపించింది.కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని కోటి 11లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది. కార్మికుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంటకస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కనీస వేతనాలు పెంపును ప్రకటించారు.
కార్మికులను నాలుగు రకాలుగా విభిజించింది సర్కార్.. కార్మికులను కార్పొరేషన్ల పరధిలో గ్రేడ్ 1, మున్సిపల్ పరిధిలో గ్రేడ్ 2, గ్రామీణ ప్రాంతాల్లో గ్రేడ్ 3గా అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ గా విభజించి కనీస వేతనాలు పెంచారు. జోన్ 1లో కనీస వేతనం రూ.12వేల 750 నుంచి రూ.16వేలకు పెంచారు. స్కిల్డ్ కార్మికులకు రూ.13వేల 772 నుంచి రూ. 18వేల 500లకు, జోన్ 1లో సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13వేల 592నుంచి రూ.17వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్ది మాట్లాడుతూ.. గత పదేండ్లలో బీఆర్ ఎస్ సర్కార్ చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు. కార్మికుల సంక్షేమానికి సర్కార్ కట్టుబడి ఉందన్నారు. కార్మికులను నాలుగు రకాలుగా విభజించాం.. పదేండ్లలో బీఆర్ ఎస్ సర్కారు కార్మికులను పట్టించుకోలేదు..మేం అధికారంలోకి రాగానే కనీస వేతనాలపై సబ్ కమిటీ వేసి 1కోటి 11లక్షలమంది కార్మికులకు లబ్ది చేకూరేలా కనీస వేతనాలు పెంచామన్నారు సీఎం.పెరిగిన కనీస వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
