రాష్ట్రంలో మూడు రోజులు రెడ్ అలర్ట్

రాష్ట్రంలో మూడు రోజులు రెడ్ అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు 11 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడ్తాయ ని హెచ్చరించింది. మహబూబాబాద్, వరంగ ల్, హనుమకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యా పేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో‌‌‌‌ మంగళ, బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తా యని తెలిపిన ఐఎండీ.. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్‌‌‌‌ను ఇష్యూ చేసింది. 

మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌‌‌‌ను ఇచ్చింది.  హైదరాబాద్‌‌‌‌ సిటీకి కూడా ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మంగళవారానికి ఆరెం జ్ అలర్ట్‌‌‌‌ను జారీ చేసిన వాతావారణ శాఖ.. బుధ, గురువారాలకు రెడ్ అలర్ట్‌‌‌‌ను ఇష్యూ చేసింది. సిటీలోని అన్ని జోన్లకూ అతిభారీ వర్ష సూచనను చేసింది.