జిల్లాలో జాతీయ జెండా ఎగురవేసిన నేతలు

జిల్లాలో జాతీయ జెండా ఎగురవేసిన నేతలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుతున్నాయి. ఈ క్రమంలో ఈ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

జనగామ జిల్లాలో సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

మెదక్ కలెక్టర్ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  

జగిత్యాల జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసారగ్ రావు క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. మెట్పల్లి, కోరుట్ల మున్సిపల్ ఆసుల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరవీరుల సేవలను గుర్తు చేసుకున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ విప్ గవ్వల బాలరాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలలు వేసి నివాళులు అర్పించారు. 

మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సమైక్యతా ఉత్సవాలు జరిగాయి. మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ జెండా ఆవిష్కరణ తరువాత ఎమ్మెల్యే శంకర్ నాయక్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. అమరుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు.   

పెద్దపల్లి జిల్లా రామగుండం, సింగరేణి రీజియన్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. అన్ని బొగ్గు గనులపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు జాతీయ జెండాను ఎగరవేశారు. గోదావరి ఖని 1వ బొగ్గుగనిపై టీబీజేకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.

లక్డికాపుల్ లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సూర్యాపేట జిల్లాలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో మంత్రి జగదీశ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేకే జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రం సాధించడానికి ఎంతో మంది త్యాగం చేశారన్నారు. ఉద్యమ చరిత్రకు తాను ప్రత్యేక్ష సాక్షిని అని ఆయన గుర్తు చేశారు.