Rajadhani Files ఓటీటీలో కాదు.. డైరెక్ట్ యూట్యూబ్‌లోకి వచ్చేసింది.. రాజ‌ధాని ఫైల్స్‌ మూవీని ఫ్రీగా చూసేయండి!

Rajadhani Files  ఓటీటీలో కాదు.. డైరెక్ట్ యూట్యూబ్‌లోకి వచ్చేసింది.. రాజ‌ధాని ఫైల్స్‌ మూవీని ఫ్రీగా చూసేయండి!

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై వచ్చిన లేటెస్ట్ మూవీ రాజధాని ఫైల్స్. ద‌ర్శ‌కుడు భాను కిర‌ణ్ తెరకెక్కించిన ఏ సినిమాలో అఖిల‌న్‌, వీణ‌, వినోద్‌కుమార్‌, వాణి విశ్వ‌నాథ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంపై జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమాపై తలెత్తిన వివాదాల కారణంగా ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేకపోయారు. 

అప్పటినుండి రాజధాని ఫైల్స్ సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్నారు ప్రేక్షకులకు. వారికి తాజాగా సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది రాజధాని ఫైల్స్ మూవీ టీమ్. అదేంటంటే.. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా డైరెక్ట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. అంతేకాదు.. ఎలాంటి     స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఈ సినిమాను చూసే అవకాశాన్ని కల్పించారు. ఇదే విషయాని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆడియన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ అవని ఈ సినిమాకి యూట్యూబ్ లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక రాజధాని ఫైల్స్ సినిమా కథ విషయానికి వస్తే.. అరుణ‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా అధికారంలోకి వచ్చిన కేఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి రాజధాని అయిరావ‌తి (అమ‌రావ‌తి) నిర్మాణాన్ని ఆపేస్తాడు. దాంతో.. ముఖ్యమంత్రి నిర్ణ‌యాన్ని వ్య‌తిరేక‌తిస్తూ.. అయిరావ‌తి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్య‌మ‌బాట ప‌డ‌తారు. వారి ఉద్య‌మాన్ని అణిచివేసేందుకు పార్టీ అధినేత ఏం చేశాడు. ఈ పోరాటం ఎలా కొనసాగింది? దానివల్ల న‌డిమిట్టి కేశ‌వులు (వినోద్ కుమార్‌) ఎలాంటి క‌ష్టాలు పడ్డారు? అన్న‌దే రాజధాని ఫైల్స్ క‌థ‌.