Rajamouli: ఆర్ఆర్ఆర్లో ఒక హీరోను ఎక్కువగా.. మరొకరిని తక్కువగా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాజమౌళి

Rajamouli:  ఆర్ఆర్ఆర్లో ఒక హీరోను ఎక్కువగా.. మరొకరిని తక్కువగా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాజమౌళి

ఇండియా ప్రైడ్ బాహుబలి(Bahubali) మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈసారి సరికొత్తగా బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌(Baahubali: Crown of Blood) పేరుతో యానిమేటెడ్ సిరీస్ గా విడుదల కానుంది. మనం ఇప్పటివరకు చూసిన బాహుబలి సినిమాల కంటే ముందు జరిగిన కథతో రానుంది ఈ సిరీస్. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో భాగంగా బాహుబలి: క్రౌన్‌ ఆఫ్ బ్లడ్‌ యానిమేటెడ్ సిరీస్ కు సంబందించిన చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు టీమ్. 

అయితే.. ఏ ప్రెస్ మీట్ లో భాగంగా రాజమౌళికి ఊహించని ప్రశ్న ఎదురైంది. దానికి అదే రేంజ్ లో కౌంటర్ వేశారు రాజమౌళి. ప్రెస్ మీట్ లో ఓ రిపోర్టర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో.. ఒక హీరోను ఎక్కువగా.. మరొకరిని తక్కువగా చుపించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా. దాని గురించి మీరు ఏమంటారు.. అని అడిగారు. దానికి సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ ప్రశ్నకు ఇది స్టేజి కాదు.. సందర్భము కాదు.. అంటూ సూపర్ కౌంటర్ వేశారు రాజమౌళి. ప్రస్థుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ రానున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.