తెంలగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలి: ప్రధాని మోదీ

తెంలగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలి: ప్రధాని మోదీ

మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా కూటమి మూడోస్థానానికి పడిపోయిందన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలే ముందుకు తీసుకెళ్తున్నారని మోదీ అన్నారు. మే 8వ తేదీ బుధవారం ఉదయం వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. "నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమాస్కారం. రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకోవడం నా అదృష్టం. ఉదయం 10 గంటలకే ఇంత పెద్ద సభ నిర్వహించడం.. నాకు గుజరాత్ లో కూడా సాధ్యం కాదు" అని అన్నారు.

 ప్రధాని మోదీ పాయింట్స్:

  • కరీనంగర్ లో బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం
  • ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ ఓటమి ఖాయం
  • కాంగ్రెస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసింది.
  • కాంగ్రెస్ సొంత ప్రధాని పీవీని అవమానించింది
  • ఎన్డీఏ ప్రభుత్వం పీవీని భారతరత్నతో సత్కరించింది.
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కుటుంబాలే ఫస్ట్
  • దేశ భద్రతనే బీజేపీకి మొదటి ప్రధాన్యత
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలది అవినీతి బంధం
  • తెంలగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విముక్తి చేయాలి
  • మనమందరం తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్పష్టమైన అవగాహన ఉంది
  • రెండు పార్టీల మధ్య అవగాహనకు కాళేశ్వరం, ఓటుకు నోటు కేసులే ఉదాహరణ
  • మీరు ఓటేస్తేనే దేశానికి ఎంతో సేవా చేశా
  • భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
  • రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి మనదేశం ఎదిగింది
  • పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు
  • మా ప్రభుత్వంలో ప్రతి రంగాన్ని ముందుకు తీసుకెళ్లాం
  •  కిసాన్ సమ్మాన్ తో రైతులను ఆర్థికంగా ఆుకుంటున్నాం