హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ ఫలితాలు విడుదల అయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం (మే 30) ఫలితాలను విడుదల చేశారు. 36,863 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయగా.. 26,542 మంది పాస్ అయ్యారు. 72 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.
ఇక.. 54,679 ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాయగా.. 37, 562 మంది పాస్ అయ్యారు. ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 68.70గా నమోదు అయ్యింది. జూన్ 4 నుంచి వెబ్ మెమో డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. మెమోల్లో తప్పులు ఉంటే జూన్ 15లోపు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
జూన్ 2 నుంచి 7 వరకు రీకౌంటింగ్ దరఖాస్తులకు గడువు విధించారు. SSC రీకౌంటింగ్ ఫీజు రూ.350, ఇంటర్‌కు రూ.400గా నిర్ణయించారు. దరఖాస్తులు ఆన్‌లైన్ లేదా మీ-సేవ ద్వారా స్వీకరించనున్నారు. ప్రత్యేక దరఖాస్తు ఫారం పంపాల్సిన అవసరం లేదని తెలిపారు.
