సెప్టెంబరు 5 ను “బ్లాక్ డే” గా ప్రకటించిన ప్రైవేట్ టీచర్స్ ఫోరం

సెప్టెంబరు 5 ను “బ్లాక్ డే” గా ప్రకటించిన ప్రైవేట్ టీచర్స్ ఫోరం

హైద‌రాబాద్: సెప్టెంబరు 5 న‌ బ్లాక్ డే‌ గా ప్రకటించనున్న‌ట్టు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తెలిపింది. ఆరోజు అన్ని DEO కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేప‌డుతామ‌ని టి.పి.టి.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ షేక్ షబ్బీర్ అలీ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వం ఆదేశాలను, జీవోలను, చట్టాలను ఉల్లంఘించాయ‌ని అన్నారు. ఇష్టారీతిలో వ్యవహరిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా , వారి శ్రమను దోచుకుంటున్నాయని మండిప‌డ్డారు.

విద్యావ్యవస్థను పరిరక్షించాలనీ విద్యాశాఖ అధికారులను, మంత్రులు, ప్రభుత్వాలను ఎన్ని మార్లు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌దుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. సిఎం కేసీఆర్ చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఈ మేర‌కు విజ్ఞప్తి చేశారు.