సర్కారు స్కూళ్లలో నో బ్యాగ్ డే ..నెలకో రోజు.. ఏటా పది రోజుల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సర్కారు స్కూళ్లలో నో బ్యాగ్ డే ..నెలకో రోజు.. ఏటా పది రోజుల ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రోజూ కిలోల కొద్దీ పుస్తకాలు మోసి మోసి అలసిపోతున్న సర్కారు బడి స్టూడెంట్లకు విద్యా శాఖ రిలీఫ్ ఇచ్చింది. చదువు అంటే కేవలం రొటీన్ క్లాసులు వినడం, హోంవర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాయడమే కాదని చెబుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న టాలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెలికితీసేందుకు ‘టెన్ బ్యాగ్ లెస్ డేస్’ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తెరపైకి తెచ్చింది. 2026–-27 అకడమిక్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఈ విధానాన్ని అమలు చేసేలా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థులకు చదువు భారం కాకుండా ఆనందకరంగా మార్చే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకువచ్చారు.

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 10 రోజులను దీనికోసం కేటాయించారు. సాధారణంగా ప్రతి నెలా మూడో శనివారం రోజున ఈ బ్యాగ్ లెస్ డే కొనసాగనుంది. ఆయా రోజుల్లో విద్యార్థులు ఎలాంటి పుస్తకాల బ్యాగులు లేకుండానే ఉల్లాసంగా బడికి హాజరవుతారు. 2026 సెప్టెంబర్ నుంచి 2027 మార్చి వరకు నిర్వహించాల్సిన తేదీలను కూడా విద్యాశాఖ ఇప్పటికే ఖరారు చేసింది. 2026లో సెప్టెంబర్ 19, నవంబర్ 21, డిసెంబర్ 19,  2027లో ఫిబ్రవరి 20, మార్చి 20, తేదీలను ప్రత్యేకంగా ప్రకటించింది. మిగతా రోజులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్లే  నిర్వహించుకోవాలని సూచించారు.  

పుస్తకాలు లేని ఈ ప్రత్యేక రోజుల్లో ఎస్సీఈఆర్టీ ప్రత్యేకంగా రూపొందించిన మాడ్యూల్ ఆధారంగా సరికొత్త అభ్యాస పద్ధతులు అమలవుతాయి. క్షేత్ర పర్యటనలు (విహారయాత్రలు), సైన్స్ ప్రయోగాలు, క్విజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బాలసభలు, చిత్రలేఖనం, నాటికలు, స్థానిక చేతివృత్తులవారితో ఇంటరాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి విభిన్న సృజనాత్మక కృత్యాల ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటారు. దీంతో పిల్లల్లో కేవలం సబ్జెక్ట్ నైపుణ్యాలే కాకుండా పరిశీలన, ఆచరణాత్మక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. 


స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షం..


బ్యాగ్ లెస్ డేను రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలయ్యేలా చూసే పూర్తి బాధ్యతను ఆర్జేడీలు, డీఈవోలు,  ఎంఈఓలతోపాటు హెడ్మాస్టర్లు, టీచర్లపై పెట్టారు. స్కూల్ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక వార్షిక ప్రణాళిక రూపొందించుకోవాలని ఇప్పటికే వారికి సూచించారు. ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులైన పిల్లలు సైతం ఉత్సాహంగా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డోర్ ట్రిప్స్ సమయంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులు నేర్చుకున్న అనుభవాలను టీచర్లు మదింపు చేసి, రిపోర్టులను డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. గతంలోనే అకడమిక్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ అంశంపెట్టినా.. ఎవ్వరూ పెద్దగా ఫాలో కావడం లేదు. దీంతో ఆ రోజు ఏం చేయాలనే వివరాలతో మరోసారి ఆఫీసర్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కొత్త విధానంపై స్టూడెంట్లు, పేరెంట్స్ నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.