భువనేశ్వర్: జూనియర్ నేషనల్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. శనివారం జరిగిన బాయ్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ గ్రూప్–2లో సుహాస్ ప్రీతమ్ 1:01.29 టైమింగ్‌తో నేషనల్ రికార్డు సృష్టించి గోల్డ్ మెడల్ సాధించాడు. గర్ల్స్ కేటగిరీలో నిత్య సాగి టాప్ ప్లేస్‌తో స్వర్ణం గెలిచింది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్ గ్రూప్–1లో బాలికల్లో వ్రితీ అగర్వాల్, బాయ్స్ 4x100 మీటర్ల రిలే టీమ్ బ్రాంజ్ గెలిచాయి.
