నీటి వివాదాలపై మీటింగ్ లకు సర్కార్ వరుస డుమ్మాలు

నీటి వివాదాలపై మీటింగ్ లకు సర్కార్ వరుస డుమ్మాలు

నీటి వివాదాలపై మీటింగ్ లకు వరుసగా డుమ్మాలు కొడుతోంది తెలంగాణ సర్కార్. 9న జరిగే కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం అందింది. అయితే ఈ మీటింగ్ కు రాలేమని సర్కార్ రిప్లై ఇచ్చింది. కోర్టు కేసుల విచారణ ఉండటంతో 9న జరిగే మీటింగ్ కు హాజరుకాలేమని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ లేఖ రాశారు. నీటి వివాదాలపై మీటింగులకు వరుసగా డుమ్మా కొడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. గట్టిగా వాదనలు వినిపించాల్సిన టైమ్ లో తప్పించుకుంటోందన్న ఆరోపణలు వస్తున్నాయి. మొన్న జరిగిన గోదావరి బోర్డు సమన్వయ మీటింగ్ కు కూడా హాజరుకాలేదు. ఫుల్ బోర్డు మీటింగ్ పెడితేనే అటెండ్ అవుతామని సాకుతో అటెండ్ కాలేదు. 9న ఫుల్ బోర్డు మీటింగ్ పెడితే.. కోర్టు కేసుల విచారణను సాకుగా చూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పైకి మాత్రం ఏపీపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ సర్కార్.. బోర్డు మీటింగులకు మాత్రం హాజరుకావడం లేదు. ఏపీ అధికారులు మాత్రం వాళ్లు చెప్పాల్సింది చెప్తున్నారు. ఈ టైంలో.. మన తరపున వాదనలు లేకపోవడం వల్ల ఏపీకి ఇన్ డైరెక్ట్ గా సహాయ పడుతున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి..