గట్టిగా అరిచి, తలుపుల్ని, కిటికీల్ని డబెల్ డబెల్ మని కొట్టి, చేతిలో ఏది ఉంటే అది విసిరి పగలగొట్టి కోపాన్ని ప్రదర్శించినంత
మాత్రాన సమస్య తీరిపోదు. భార్యాభర్తలు టెంపర్ ని కరెక్ట్‌గా డీల్ చేయకపోతే.. అది స్లోగా బ్రేకప్ కు దారి తీస్తుంది.
టెంపర్ కూడా ఒక ఎమోషనే!
భయం, బాధ, సంతోషం, కరుణ, ప్రేమ, ఎగ్జైట్ మెంట్ లాగే టెంపర్ కూడా ఒక నేచురల్ ఎమోషన్ . ఇది ఒక్కోసారి ఒక్కో విషయాన్ని
తెలియజేస్తుంది. ఒకసారి భావాన్ని బయటికి చెప్తే.. మరోసారి ఆ స్థితి ఎదుటివాళ్లను భయపెడుతుంది. అప్ సెట్ చేస్తుంది. ద్వేషం
పెం చుకునేలా చేస్తుంది. చెప్పాలనుకున్న విషయం మరుగున పడేసి టెంపర్ డామినేట్ చేస్తుంది. అంటే కోపం అన్ని ఎమోషన్స్ ని
కప్పేస్తుంది! అందులో ప్రేమ, సంతోషం కూడా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటు న్నప్పుడు కోపం రావడంలో తప్పు లేదు. కానీ, ఆ కోపం చర్యగా(యాక్షన్ ) మారి, ఎదుటివాళ్లకు ఇబ్బంది కలిగించినప్పుడే అసలు సమస్య వస్తుంది.
బేసిక్ రీజన్ ..
ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాక మొదట్లో అంతా గులాబీ తోటలాగే కనిపిస్తుంది. ఆ వ్యూని ఎంజాయ్
చేస్తారు. కొన్నాళ్ల తర్వాత గులాబీ కింద ముళ్లు ఉన్నా యన్న సంగతి అర్థమవుతుంది. పువ్వుల్ని ఆస్వాదిం చడం మానేసి, అవసరం లేకున్నా పదేపదే టెంపర్ అనే ముల్లుని ముట్టుకుంటారు. బాధతో విలవిల్లాడుతూ ఏడుస్తారు. ‘అంతా నీ వల్లే’ అంటూ నిం దలేసుకుంటూ నిద్రకూ దూరమవుతారు. టెంపర్ అన్నది పార్ట్‌నర్స్ ఇద్దరిలో ఉండొచ్చు. ఒక్కరిలోనూ ఉండొచ్చు. ఇద్దరిలోనూ టెంపర్ ఉంటే.. ఎవరూ తగ్గరు. కాబట్టి ఆ సంసారంలో సంతోషం ఆవిరైతుంది. ఇక, పార్ట్‌నర్స్ లో ఒక్కరిలో బ్యాడ్ టెంపర్ ఉంటే..
కొన్నాళ్ల తర్వాత కూల్ పార్ట్‌నర్ కూడా బ్యాలెన్స్ కోల్పోతారు. బ్యాడ్ టెంపర్ మీ బంధంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది
దీన్ని రియలైజ్ కారు. ఏ బంధమైనా బీటలువారడానికి.. కోపమే బేసిక్ రీజన్ !
ఎందుకొస్తుంది?
రిలేషన్ షిప్ అన్నది ఒక గేమ్ . ఒకరి మీద మరొకరు స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకరిమీద మరొకరు పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. ‘మాది డబ్బు ఉన్న కుటుంబం’.. ‘మేమింత చీప్ కాదు’ లాంటి మాటలతో సోషల్ , ఫైనాన్షియల్ ఆధిక్యత ప్రదర్శిస్తారు. ఇలాంటి ప్రవర్తన రిలేషన్ షిప్ మీద విరక్తి పుట్టిస్తుంది. అప్పుడు కోపం పుడుతుంది. అనుకున్నది
జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు పార్ట్‌నర్స్ లో ఎవరికో ఒకరికి టెంపర్ లేస్తుంది. ఒక్కోసారి ఎవరి మీది కోపాన్నో పార్ట్‌నర్ మీద చూపిస్తారు. బంతిని గోడకు ఎంత గట్టిగా విసిరికొడితే.. అంతే వేగంగా తిరిగొస్తుంది. కోపం కూడా అంతే.. పదేపదే కోపాన్ని
ప్రదర్శిస్తు న్నప్పుడు కూల్ గా ఉండే పార్ట్‌నర్ కూడా కొన్నాళ్లకు బ్రేకప్ వరకు వెళతారు.
యాంగర్ మేనేజ్ మెంట్
కోపాన్ని అణచివేయడమే ‘యాంగర్ మేనేజ్ మెంట్ ’అని అనుకుంటారు చాలామంది. అయితే, ‘నాకు అసలు కోపమే రావొద్దు ’ అనేది హెల్దీ గోల్ కాదు. దాన్ని ఎంతగా తొక్కిపెట్టినా అది పైకిలేస్తది.కోపం అనే ఒక సహజమైన ఎమోషన్ వెనకున్న మెసేజ్ ని
అర్థం చేసుకొని, దాన్ని కంట్రోల్ తప్పకుండా హెల్దీగా ఎక్స్ ప్రెస్ చేయడమే ‘యాంగర్ మేనేజ్ మెంట్’. అంటే కోపాన్ని ఫీల్ కావాలి కానీ, బయటకు ప్రదర్శించొద్దు . ఆ కోపాన్ని మాటల రూపంలోకి మార్చి చెప్పగలగాలి. అప్పుడే జీవితంలో వచ్చే రకరకాల కల్లో లాల్నితప్పించుకోగలుగుతారు. ప్రాక్టిస్ తోనే యాంగర్ మేనేజ్ మెంట్ సాధ్యం అవుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలినవాళ్లే… బంధాన్ని మెరుగ్గా , అందంగా నిర్మించుకుంటారు. వేగంగా గోల్స్ ని అందుకుంటారు. సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన జీవితం సొంతం చేసుకుంటారు.
కోపం ఉంటే నేరుగా..
కోపం ఉంటే ఏ విషయంలోనైనా ‘ఓవర్ జన్రలైజింగ్ ’ చేస్తారు. ‘నువ్వు నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్ చేస్తావ్ . నా అవసరాలను
ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవు. అందరు నన్నే తిడతారు. నాకు అర్హత ఉన్నా క్రెడిట్ దక్కదు’ ఇలాంటి మాటలన్నీ అంటే కోపం
గిల్లితే వచ్చేవే! ఇవన్నీ ఓవర్ జన్రలైజింగ్ కేటగిరీ కిందే ఉంటాయి. కోపంలో ఉన్నప్పుడు ‘కచ్చితంగా’ ‘తప్పకుండా’ అనే పదాలతో ఏ మాట మాట్లాడినా కష్టంగా ఫీలవుతారు. లోపల నిద్రపోతున్న కోపం వల్లే మన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకుంటున్నా రో.. ఒక్కటే ఆలోచిస్తారు. వాళ్లను వాళ్లే అగౌరవ పరుచుకుం టారు. ఇది యాం గ్జైటీకి దారి తీస్తుంది. జరిగిపోయిన విషయాల్ని భూతద్దం లో చూడటం. అనుకున్న దానికి విరుద్ధంగా జరిగితే.. దానికి బాధ్యత వహించాల్సింది పోయి.. దానికి అవతలి వాళ్లను బ్లేమ్
చేయడం ఇవన్నీ కోపం వల్లే జరుగుతాయి.
నమ్మకం పోతుంది
బంధం అన్నాక ముద్దు ముచ్చటతో పాటు కోపతాపాలు కూడా ఉంటాయని కొంతమంది పార్ట్‌నర్స్ కవర్ చేస్తుంటారు. వాళ్ల కోపాన్ని మాటల్లో చెప్పకుండా..చేతల్లో చూపిం చడం కచ్చితంగా ప్రేమలో భాగం కాదు. ఊరికే కోపం వస్తుంటే.. అది గొడవలకు కారణమవుతుంటే.. పార్ట్‌నర్స్ లో ‘మళ్లీ కలుస్తాం’ అనే నమ్మకం నెమ్మదిగా పలుచబడుతుంది. ఎందుకంటే ఆ టైంలో
అన్న మాటలు మనసుకు గాయం చేస్తాయి .తర్వాత ఆ విషయం మీద కలిసి కూర్చొని మాట్లాడలేకపోతారు. ఈ పోట్లాట ఆగాలంటే
కలిసి చర్చిం చుకోవాలి. బ్యాడ్ టెంపర్ ఉంటే ఏ విషయం చర్చిం చాలన్నా కష్టమే. అప్పుడు మళ్లీ కలవడానికి చాలా కష్టపడతారు.
ఒక లిమిట్ ఉంటుంది
ఎవరి మీదైనా అసహనం ప్రదర్శించడానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ, ఆ లిమిట్ దాటి అసహనం ప్రదర్శిస్తే.. ఒక రోజు అది పరీక్షకు గురవుతుంది. అప్పుడు వాళ్లు మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధం కావొచ్చు. చాలా మంది తమ పార్ట్‌నర్ సరిగ్గా ట్రీట్ చేయట్లేదనే అనుకుం టారు. కానీ, బయటకు చెప్పరు. ఎప్పుడైతే మూత తీసి మీ పార్ట్‌నర్ పై కోపం కక్కుతారో.. అప్పుడు తెలుస్తుంది. వాళ్ల స్వేచ్ఛని తగ్గిస్తున్నా రని! మీలో నిత్యం పొంగే కోపం వల్ల తెలియకుం డానే మీరు మీ పార్ట్‌నర్ కి దూరం అవుతుంటారు. సంతోషం లేని చోట నుంచి దూరంగా వెళ్లిపోవడం మనిషి లక్షణం. అలా కోపంతో పార్ట్‌నర్ మెసే జ్ కి రిప్లై ఇవ్వకపోవడం, బయటకు రమ్మన్నా రాకపోవడం, ఫోన్ కాల్స్ ని తగ్గించడం ఇలా అన్ని విధాలుగా దూరం పెట్టడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది.
