టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసే జాకెట్‌‌‌‌‌‌‌‌

టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసే జాకెట్‌‌‌‌‌‌‌‌

కాస్త ఎక్కువ ఎండ కొట్టినా, చలి ఎక్కువ పెట్టినా భరించలేరు కొందరు. అలాంటి వాళ్లకోసమే ఒక జాకెట్‌‌‌‌‌‌‌‌ తయారుచేశారు ఐఐటి విద్యార్థులు రాహుల్‌‌‌‌‌‌‌‌ బన్సాల్‌‌‌‌‌‌‌‌, ఫాల్గుణ్‌‌‌‌‌‌‌‌ వ్యాస్‌‌‌‌‌‌‌‌. ఈ జాకెట్‌‌‌‌‌‌‌‌ ఎండాకాలంలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుంది. 

ఐఐటి రోపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్‌‌‌‌‌‌‌‌ మెకానికల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ , ఐఐటి మద్రాస్‌‌‌‌‌‌‌‌లో ఫాల్గుణ్‌‌‌‌‌‌‌‌ కెమికల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ చదువుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసే వెస్ట్‌‌‌‌‌‌‌‌ (జాకెట్‌‌‌‌‌‌‌‌) ప్రోటోటైప్‌‌‌‌‌‌‌‌ను ముంబైలో జరిగిన ఐఐటి ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ 2022 పోటీలకోసం తయారుచేశారు. వీళ్ల ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌కి యాభైవేల ప్రైజ్‌‌‌‌‌‌‌‌ మనీతో మూడో స్థానం దక్కింది. దీనికి ‘థర్మో ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ కూలింగ్‌‌‌‌‌‌‌‌ వెస్ట్‌‌‌‌‌‌‌‌’ అని పేరు పెట్టారు. 

కాటన్‌‌‌‌‌‌‌‌, లెనిన్‌‌‌‌‌‌‌‌తో తయారుచేసిన వెస్ట్‌‌‌‌‌‌‌‌ లోపల థర్మోఎలక్ట్రిసిటీ డివైజ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దానికి ఒక రిమోట్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటుంది. ఆ రిమోట్‌‌‌‌‌‌‌‌ సాయంతో వెస్ట్‌‌‌‌‌‌‌‌ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేయొచ్చు. దాదాపు 15 డిగ్రీ సెల్సియస్‌‌‌‌‌‌‌‌ వరకు టెంపరేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించొచ్చు. వెస్ట్‌‌‌‌‌‌‌‌లో తక్కువ వోల్టేజ్‌‌‌‌‌‌‌‌ ఉన్న బ్యాటరీలు వాడటం వల్ల షాక్ కొట్టదు. ఈ బ్యాటరీలకు ఫుల్‌‌‌‌‌‌‌‌ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఆరుగంటలు పనిచేస్తాయి. హాస్టల్‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌లో ఏసి, కూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటివేవీ ఉండవు. చలిపెట్టినా, వేడిగా అనిపించినా సర్దుకు పోవాల్సిందే. ఆ ఇబ్బందులనుంచి వచ్చిందే ఈ ఆలోచన.  ఏ వాతావరణంలో అయినా పని చేసే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌లు, డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌కు ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు రాహుల్‌‌‌‌‌‌‌‌, ఫాల్గుణ్‌‌‌‌‌‌‌‌.