జూన్ 5 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల

జూన్ 5 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. హాల్ టికెట్లు విడుదల

 టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడిదుల చేసింది ఎస్ఎస్సీ బోర్డు. అందులో భాగంగా సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 05 నుంచి జూన్ 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 31 వేల 542 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 93 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 

పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్, సైన్స్ సబ్జెక్టులకు  టైమింగ్స్ వేరే ఉన్నాయి. 

ఫస్ట్ లాంగ్వేజ్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. 
సైన్స్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ గా రెండు పేపర్లు ఉండటంతో.. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫిజిక్సు, బయాలజీ ఒక్కో పేపర్ ఒక్కో రోజు ఉంటుంది. 

  • వెబ్ సైట్లో హాల్ టికెట్లు:

సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను విడుదల చేశారు. డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా డైరెక్టర్ తెలిపారు. లేదంటే స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి కూడా హాల్ టికెట్లు పొందవచ్చునని తెలిపారు. 
వెబ్ సైట్: www.bse.telangana.gov.in
ఫిర్యాదులకు సంప్రదించాల్సిన ఫోన్ నెం: 040–23230942