టెర్రరిస్టులు చంద్రుడిపై నుంచి ఊడిపడలేదు

టెర్రరిస్టులు చంద్రుడిపై నుంచి ఊడిపడలేదు
  • పాక్​ వారికి ఆశ్రయమిచ్చి, ప్రోత్సహిస్తోంది
  • మనకు ఈయూ​ ప్లీనరీ మద్దతు

బ్రస్సెల్స్: ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా.. అక్కడ జరుగుతున్న టెర్రరిస్టు దాడులకు కారణం పొరుగున ఉన్న దేశమే. టెర్రరిస్టులు ఎక్కడో చంద్రుడి మీద నుంచి ఊడిపడడంలేదు. పక్కనే ఉన్న దేశం వారికి ఆశ్రయమిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మనం ఇండియాకు సపోర్ట్​ చేయాలి’ అంటూ యూరోపియన్​ పార్లమెంట్ ​సభ్యుడు రిస్జార్డ్​ సిజర్​నెకి అన్నారు. ఈమేరకు యూరోపియన్​ పార్లమెంట్ ​ప్లీనరీలో కాశ్మీర్​ అంశంపై స్పెషల్​ డిబేట్​ జరిగింది. ఇందులో రిస్జార్డ్​తోపాటు మరో సభ్యుడు ఫుల్వియో మార్చుసియెల్లో ఇండియాకు మద్దతు తెలిపారు. న్యూక్లియర్​ వెపన్స్ ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్​ తరచూ బెదిరింపులకు పాల్పడుతోందని, ఇది యూరోపియన్​యూనియన్​కూ ప్రమాదకరమేనని మార్చుసియెల్లో చెప్పారు. పాక్​లో తలదాచుకుంటున్న టెర్రరిస్టులు యూరప్​లోనూ టెర్రర్​దాడులకు ప్లాన్​చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్​ విషయంలో  ఇండియా, పాక్​ చర్చలు, సంప్రదింపులతో శాంతియుత ఒప్పందం చేసుకోవాలని ఈయూ మినిస్టర్​టైతి టుప్పరేయినెన్ ​సూచించారు.

‘Terrorists Didn’t Land from Moon, They Came from Pak' says European parliament member