ఇవాళ (మే 17) టీజీ ఎప్సెట్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల

ఇవాళ (మే 17) టీజీ ఎప్సెట్  ఫలితాలు.. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల
  • కీ అబ్జెక్షన్లన్నీ తిరస్కరణ.. పాత ఆన్సర్లే కరెక్ట్
  • ఫలితాల వెబ్‌‌సైట్ https://eapcet.tgche.ac.in


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఎప్‌‌‌‌సెట్  ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కూకట్‌‌‌‌పల్లిలోని జేఎన్‌‌‌‌టీయూ గోల్డెన్ జూబ్లీ హాల్‌‌‌‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, టీజీసీహెచ్​ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌‌‌‌లలో కలిపి మొత్తం 2,82,195 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 

అగ్రికల్చర్ అండ్  ఫార్మసీ స్ట్రీమ్  స్టూడెంట్లకు మే 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 90,977 మందికి గాను 84,954 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం విద్యార్థులకు  మే 9 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షలకు 2,10,766 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,97,241మంది హాజరయ్యారు. ఫలితాలను వెబ్‌‌‌‌సైట్ https://eapcet.tgche.ac.in లో పెడ్తామని, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ర్యాంకు కార్డులను డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని  ఎప్ సెట్ కన్వీనర్  ప్రొఫెసర్  విజయకుమార్ రెడ్డి చెప్పారు. 

  • అబ్జెక్షన్లు తిరస్కరణ

ప్రిలిమినరీ కీపై వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని ఎప్ సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పేపర్లకు ఒక్క ఆబ్జెక్షన్ కూడా రాకపోవడం విశేషం. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌‌‌‌లో 16 ప్రశ్నలపై 22 మంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్లే సరైనవని తేల్చింది. దీంతో కీలో ఎలాంటి మార్పులు లేకుండానే ఫలితాలను విడుదల చేస్తున్నారు. గతేడాది 48 అబ్జెక్షన్లు రాగా, ఈసారి ఆ సంఖ్య 16కే పరిమితం కావడం గమనార్హం.