మే 28 నుంచి పీజీఈసెట్..నాలుగు రోజుల పాటు జరగనున్న ఎగ్జామ్స్‌‌‌‌

మే 28 నుంచి పీజీఈసెట్..నాలుగు రోజుల పాటు జరగనున్న ఎగ్జామ్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28 నుంచి టీజీ పీజీఈసెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 26,005 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు వెల్లడించారు. మే 28న ఉదయం సెషన్‌‌‌‌లో జియో-ఇంజనీరింగ్, ఫార్మసీ అభ్యర్థులకు, మధ్యాహ్నం సెషన్‌‌‌‌లో సివిల్, ఎలక్ట్రికల్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి.

మే 29న ఉదయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయో-టెక్నాలజీ, మెకానికల్, మధ్యాహ్నం కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ పరీక్షలు ఉంటాయి. మే 30న ఉదయం ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్, కెమికల్, టెక్స్‌‌‌‌టైల్, మైనింగ్, మధ్యాహ్నం ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. మే 31న చివరి రోజున ఎన్విరాన్మెంటల్ మేనేజ్‌‌‌‌మెంట్, నానో టెక్నాలజీ పరీక్షలు జరగనున్నాయి.