రోడ్డు వేయాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన బాలుడు

రోడ్డు వేయాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన బాలుడు

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు వింత అనుభవం ఎదురైంది. స్థానిక నేతలతో కలిసి వెళుతున్న ఎమ్మెల్యేను యశ్వంత్ అనే బాలుడు కాలనీకి రోడ్డు కావాలని అడిగాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే .. ఆ తర్వాత రోడ్డు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ఎస్టిమేషన్ వేయాలని అధికారులను ఆదేశించారు.