హాట్ టాపిక్గా ‘కలర్ ఫోటో’

హాట్ టాపిక్గా ‘కలర్ ఫోటో’

చిన్న సినిమాలైనా సరే మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు వరిస్తాయని మరోసారి రుజువైంది. ఇప్పుడు ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్ టాపిక్గా మారింది. కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించగా.. అందులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో ‘కలర్ ఫోటో’ చిత్రం అవార్డు గెలుచుకోంది. 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.

ఇద్దరు ప్రేమికుల మధ్య కులం అడ్డుగోడగా ఉండడంతో వారు జీవితాలు చివరికి ఏమయ్యాయి అని ఎంతో చక్కగా ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్.  ఈ సినిమాలో సునీల్ విలన్గా నటించాడు. చిన్న చిత్రంగా 2020 అక్టోబర్ 23 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకొంది. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. 

67వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లోనూ ఉత్తమ తెలుగు సినిమాగా జెర్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  జాతీయ‌ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని న‌టించిన ‘జెర్సీ’ అవార్డు సొంతం చేసుకుంది. 2019 సంవ‌త్సరానికి గాను ప్రభుత్వం ఈ అవార్డుల‌ను ప్రక‌టించింది. రిలీజ్కు ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఆ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేషనల్ అవార్డు కొట్టింది.