గణేష్ నిమజ్జనం : ఉదయం 6 నుంచి అందుబాటులో మెట్రో రైళ్లు

గణేష్ నిమజ్జనం : ఉదయం 6 నుంచి అందుబాటులో మెట్రో రైళ్లు

హైదరాబాద్ లో ఈనెల 9వ తేదీన గణేష్ మహా నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ టైమింగ్ పొడిగిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో ట్రైన్స్ ఒంటి గంటకు ముగుస్తాయి. 2 గంటలకు ట్రైన్స్ టర్మినల్స్ కు చేరుతాయి. మొత్తం 3 కారిడార్లలో మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి వెల్లడించారు.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్లో  పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ నుండి ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శోభయాత్ర సందర్భంగా వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.