
కామారెడ్డి , వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు రూ. 422 కోట్ల విలువైన 1,91,567 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు కామారెడ్డి అడిషనల్కలెక్టర్చంద్రమోహన్ తెలిపారు. సోమవారం ఆయన తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి, సంతాయిపేట, బ్రహ్మణ్పల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో రైసుమిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. చంద్రమోహన్మాట్లాడుతూ.. కాంట పెట్టిన వెంటనే ఆన్లైన్లో ఏంట్రీ చేయాలన్నారు. ట్యాబ్లో ఎంట్రీ అయిన వెంటనే రైతుల అకౌంట్‌లో పైసలు జమ చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను మిల్లుల్లో ఉన్న కెపాసిటీ మేరకు ఆన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున మిల్లులకు వచ్చిన వడ్లను డిలే చేయకుండా ఆన్లోడ్ చేసుకోవాలన్నారు. డీఎస్వో మల్లిఖార్జునబాబు, డీఎం నిత్యానందం, తదితరులు పాల్గొన్నారు.