కేబుల్ ఆపరేటర్ ను రక్షించిన కానిస్టేబుల్

కేబుల్ ఆపరేటర్ ను రక్షించిన కానిస్టేబుల్

హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట పోలీస్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నారు. విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలను రక్షించాడు. కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రశీద్..కరెంట్ పోల్ పై కేబుల్ వైర్ లాగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. నిచ్చెన పై నుంచి అమాంతం కింద పడిపోయాడు. అక్కడున్న వారందరూ చూస్తూ ఉండిపోయారే కానీ..ఒక్కరు కూడా అతడి ప్రాణాలను రక్షించేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ మహ్మద్ జాకీర్..బాధితుడికి ఫస్ట్ ఎయిడ్ థెరపీ అందించి అతడి ప్రాణాలను కాపాడాడు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. 

ఎంతో సమయ స్ఫూర్తితో వ్యవహరించి ..తన విధులను బాధ్యతగా నిర్వర్తించిన కానిస్టేబుల్ జాకీర్ ను స్థానికులు అభినందించారు. తోటి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు. కరెంట్ షాకు గురై ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.