వెరైటీ రాఖీలు,గిఫ్ట్​లు..నెల రోజుల ముందే ఆర్డర్లు

వెరైటీ రాఖీలు,గిఫ్ట్​లు..నెల రోజుల ముందే ఆర్డర్లు

హైదరాబాద్, వెలుగు:  అక్కా చెల్లెళ్లు తమ తోబుట్టువులకు మెమోరబుల్ రాఖీ కట్టాలని,  సర్ ​ఫ్రైజ్​ గిఫ్ట్  ఇవ్వాలని అన్నా తమ్ముళ్లు చూస్తుంటారు. ​ప్రస్తుతం మార్కెట్​లో కస్టమైజ్డ్ రాఖీలు, గిఫ్ట్​లకు క్రేజ్ పెరిగిపోయింది. క్రియేటివ్ గా, కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుని తయారు చేయించుకుంటున్నారు.  ఇప్పుడిది ట్రెండ్​గా మారింది. కొంతకాలం కిందట పండుగ ముందు రోజు మార్కెట్ లో దొరికేవి కొనేవారు.  ప్రస్తుతం తమ టేస్టీకి తగినట్టుగా మేకింగ్​చేయించుకుంటున్నారు.  దీంతో కస్టమైజ్డ్ గిఫ్ట్ స్టోర్ల కు ఆర్డర్లు పెరిగిపోయాయి. ఫొటోలతో కూడిన హ్యాండ్ మేడ్ రాఖీలు, ఫొటో ఫ్రేమ్​లకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఫారెన్​లో ఉండే అన్నదమ్ములకు కొరియర్లు కూడా చేస్తున్నారు.  కస్టమర్ల టెస్ట్​కు తగ్గట్టుగా మేకర్స్​ తయారు చేస్తున్నారు. 

 రాఖీలపై ఫొటోలను ప్రింట్​గా.. 

రాఖీల్లో వెరైటీలు వచ్చేశాయి. సర్ ​ప్రైజ్​​గా ఉండాలని చూస్తున్నారు.  ఫొటో కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అన్నా, తమ్ముడు ఫొటోలను రాఖీల మీద ప్రింట్లు, కొన్ని ఫొటోలతో కలిపి  ఫ్రేమ్  తయారు చేయిస్తున్నారు.  వీటి ధర 500 నుంచి ఉంటుంది. కీ చైన్ రాఖీల మీద ఫొటో ప్రింట్లు వేయిస్తున్నారు. వాటిని కీ చైన్లు వాడుకోవచ్చు. వీటి ధర 500 వరకు ఉంటుంది. 

ఒకే ఫ్రేమ్ లో వంద ఫొటోలు

వంద ఫొటోలను ఒక్క ఫ్రేమ్​లో పెట్టి మోజాకో మోడల్​లో తయారు చేస్తారు. దీనికి  రూ. 1000 నుంచి 2 వేల దాకా ధర ఉంటుంది. ఫొటో ఫ్రేమ్ లతో పాటు చెక్క పైన ఫొటోలను ప్రింట్​గా వేస్తుంటారు.  ఉడెన్ ఫ్రేమ్ లకు 800 నుంచి 3 వేలు, ఎల్ఈడీ ప్రింట్లకు ఒక్కో ప్రింట్​ధర  రూ. 1500 నుంచి 3 వేల వరకు మేకర్స్​ తీసుకుంటారు. 

రాఖీ నాటితే మొక్కగా.. 

ఎకో ఫ్రెండ్లీ రాఖీలు, సీడ్ పెన్ లు, సీడ్ గణేశ్​ల  మాదిరిగానే ఇప్పుడు సీడ్ రాఖీలు వచ్చేశాయి. ఎకో ఫ్రెండ్లీ రాఖీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వాటిని తయారు చేసేటప్పుడు మధ్యలో ఒక చిన్న సీడ్ ని పెడతారు. పండుగ అయ్యాక దాన్ని తీసి మట్టిలో నాటితే మొలుస్తుంది.  వీటి ధరలు 200 నుంచి మొదలవుతాయి.  ప్లాంటబుల్, సీడ్, రాఖీ విత్ నేచురల్ ఫ్లవర్స్ పేరుతో ఆన్​లైన్​లోను అందుబాటులో ఉన్నాయి. 

నెల రోజుల ముందు నుంచే ఆర్డర్లు

నెలన్నర నుంచే కస్టమైజ్డ్ రాఖీలకు ఆర్డర్లు వస్తుండగా ఇప్పటి వరకు 500 వరకు వచ్చాయి. ఫారెన్​లో ఉండే వారి కోసం ముందుగానే తయారు చేయించి పంపిస్తున్నారు. రెడీమేడ్ కంటే హ్యాండ్ మేడ్ రాఖీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్​చూపిస్తు ఆన్​లైన్​లో ఆర్డర్లు ఇస్తున్నారు.  వారు కోరుకున్న విధంగా తయారు చేసి ఇస్తున్నాం.

- సతీష్ కుమార్, గిఫ్ట్స్ అడ్డా, మణికొండ 

నేమ్స్ ఉండేలా చేయించా..

 అన్నయ్య కోసం నే మ్స్​​ బ్రాస్ లెట్ రాఖీ ఆర్డర్ చేయగా నిన్ననే ఇచ్చారు. ప్రైజ్ కూడా రీజనబుల్ గా ఉంది.  మామూలు రాఖీ కంటే నేమ్ ఉన్నదైతే  స్పెషల్ గా ఉంటుందని ఈసారి ప్లాన్ చేశా. 
- రేణు, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, కేపీహెచ్​బీ