ప్రభాస్ సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్.. ఎట్టకేలకు స్పందించిన మేకర్స్

ప్రభాస్ సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్.. ఎట్టకేలకు స్పందించిన  మేకర్స్

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) హీరోగా వస్తున్న మూవీ సలార్ (Salaar). ఇప్పటివరకు ప్రభాస్ ఏ సినిమాకు రాని హైప్ ఈ సినిమాకు వచ్చింది. నిజానికి బాహుబలి తరువాత ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా అంటే సలార్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇటీవల సలార్ నుండి రిలీజైన ఫస్ట్  గ్లింప్స్ ఆ అంచనాలని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. 

అంతా  బానే ఉంది సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ అవనుంది అనుకునే టైంలో.. మల్లి పోస్ట్ పోన్ అనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాస్త అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ వార్తలపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో.. సలార్ పోస్ట్ పోన్ అనేది కేవలం రూమర్  అనుకున్నారంతా. 

తాజాగా ఈ వార్తలపై అధికారికంగా స్పందించారు మేకర్స్. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా సలార్ వాయిదాపై ఓ పోస్ట్ చేశారు. సలార్ సినిమాను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి మా దవ్యవాదాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడంలేదు. ప్రేక్షకులు, అభిమానులు పరిస్థితిని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికే చిత్రయూనిట్ కష్టపడుతున్నారు. సలార్ కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాము అని రాసుకొచ్చారు. దీంతో సలార్ వాయిదా విషయంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ కు తెరపడింది.