ఇంటర్ వర్కింగ్ డేస్ 182 రోజులే

ఇంటర్ వర్కింగ్ డేస్ 182 రోజులే
  • ఈసారి తగ్గిన వర్కింగ్ డేస్
  • దసరాకు మూడ్రోజులు,సంక్రాంతికి రెండ్రోజులే హాలీ డేస్
  • మార్చి 24 నుంచి ఫైనల్‌ ఎగ్జామ్స్
  • అకడమిక్ క్యాలెండర్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు గురువారం అకడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభమైం దని, వచ్చే ఏడాది ఏప్రిల్ 16తో ముగుస్తుందని ప్రకటించింది. 2020–21 అకడమిక్ ఇయర్ లో మొత్తం182 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ టెంపరరీ అకడమిక్ క్యాలెం డర్ వివరాలను వెబ్ సైట్​లో పెట్టారు. 2019–20 అకడమిక్ ఇయర్ లో 222 వర్కింగ్ డేస్ ఉండగా, ఈసారి 40 వర్కింగ్ డేస్ తగ్గాయి. పోయినేడాది 12 రోజులు దసరా సెలవులు ఇవ్వగా, ఈసారి వాటిని మూడ్రోజులకు తగ్గించారు. అక్టోబర్ 23 నుంచి 25 వరకు దసరా,వచ్చే ఏడాది జనవరి 13,14 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జా మ్స్, మార్చి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపింది.మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పింది. ఏప్రిల్ 17 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీ డేస్ ఉంటాయని, మేలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఉంటుందని ఇంటర్ బోర్డు వెల్లడించింది. అయితే సర్కార్ , ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.మరోవైపు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్బోర్డు ఇంకా గుర్తిం పు ఇవ్వలేదు. అయినా సెప్టెంబర్ 1 నుంచే అకడమిక్ క్యాలెం డర్ ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.