ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన కేసీఆర్.. వెంటనే 80,039 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో యూనిఫాం జాబ్స్ ను మినహాయించి మిగతా జాబ్స్ కు ఉద్యోగుల వయో పరిమితి పెంచుతున్నామని ఆయన ప్రకటించారు. ఉద్యోగాలకు వయో పరిమితిని పదేళ్లకు పెంచుతున్నామని చెప్పారు. ఓసీలకు 44 ఏళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు ఏజ్ లిమిట్ పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేస్తున్నామని వెల్లడించారు. షెడ్యూల్ 9, 10 వివాదం పరిష్కారమైతే మరో 10 నుంచి 20 వేల ఉద్యోగాలు కొత్తగా వస్తాయన్నారు. ఇకపై ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. ఎప్పటికప్పుడు ఉద్యోగ భర్తీలను నింపుతామన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్

మాకు రాజకీయాలంటే పెద్ద టాస్క్

ఇక నుంచి 95 శాతం స్థానికులకే  ఉద్యోగాలు