బ్లాక్ ఫ్రై డే సేల్స్‌లో 20 మిలియన్ డాలర్ల నష్టం

 బ్లాక్ ఫ్రై డే సేల్స్‌లో 20 మిలియన్ డాలర్ల నష్టం

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ మొబైల్స్‌కి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. చాలామంది పండుగ ఆఫర్స్ టైంలో వాటి ప్రైజ్ కొంత తగ్గితే కొనాలని చూస్తుంటారు. అయితే, ఈ డిసెంబర్‌‌లో క్రిస్‌మస్ పండుగని పురస్కరించుకొని బ్లాక్ ఫ్రై డే సేల్స్‌ ప్రారంభించారు. ప్రతీ పండుగ టైంలో 20 మిలియన్ డాలర్లు విలువచేసే యాపిల్ ఫోన్లు అమ్ముడయ్యేవి. అయితే, ఈ సీజన్ మాత్రం ఆ కంపెనీకి నష్టాల్లోనే ముగిసేలా ఉంది. దీనికి కారణం మార్కెట్‌లో యాపిల్ ఫోన్లకి డిమాండ్ ఎక్కువ ఉండటం, దానికి తగ్గ ప్రొడక్షన్ లేకపోవడమే అంటున్నారు యాజమాన్యం.

ఈ పండుగ సీజన్‌లో ఐఫోన్ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్ ఫోన్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ సిరీస్ మొబైల్స్ కేవలం చైనాలోనే తయారవుతాయి. అయితే, చైనాలో లాక్‌డౌన్ కారణంగా ప్రొడక్షన్ ఆగిపోయింది. డిమాండ్‌కి తగ్గ సప్లై లేకపోవడంతో యాపిల్‌కి 20 మిలియన్ల నష్టం వచ్చింది. అయితే, కొన్ని కారణాలచేత చైనాలో ఉన్న యాపిల్ మాన్యుఫాక్చరింగ్ యునిట్‌ని తొలగించి భారత్‌లో స్థాపించాలని చూస్తున్న విషయం తెలిసిందే.