రాత్రి 8 గం. వరకు కొనసాగనున్న కౌంటింగ్ ప్రక్రియ

రాత్రి 8 గం. వరకు కొనసాగనున్న కౌంటింగ్ ప్రక్రియ

రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్.. నల్గొండలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో కౌంటింగ్ జరుగుతోంది. అధికారులు బ్యాలెట్ కట్టలు కడ్తున్నారు. ఈ ప్రక్రియ రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ గత ఎన్నికల్లో 53శాతం పోలింగ్ నమోదు కాగా ఇప్పుడు భారీగా 70 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.

టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి రాముల్ నాయక్, బీజేపీ నుంచి పేమేంద్రరెడ్డి పోటీ పడ్డారు. టీజేఎస్ నుంచి కోదండరామ్, వామపక్షాల నుంచి జయసారధి రెడ్డి పోటీ చేశారు. యువతెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమదేవి, ఇండిపెండెంట్‌గా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  రాత్రి పది గంటల సమయంలో మొదటి రౌండ్ ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది.