దేశంలో ఎక్కువగా జరుగుతున్న ఐడెంటెటీ దొంగతనం

దేశంలో ఎక్కువగా జరుగుతున్న ఐడెంటెటీ దొంగతనం

ఐడెంటిటీ ప్రూఫ్‌‌, అడ్రస్ ప్రూఫ్‌‌  కరెక్ట్‌‌గా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని కేవైసీలో  చూస్తున్నారు. బిజినెస్‌‌లు తమ కస్టమర్ల గురించి తెలుసుకోవడానికి, ఐడెంటిటీ దొంగతనాన్ని, మోసాన్ని ఆపడానికి కేవైసీ చేస్తారు. దేశంలో ఐడెంటెటీ దొంగతనం ఎక్కువగా జరుగుతోంది. బ్లాక్ మార్కెట్‌‌లో రూ.500 ఇచ్చినా వందల మంది పాన్‌‌ కార్డ్‌‌, ఆధార్ కార్డ్ నెంబర్లు దొరుకుతాయి. ఫలితంగా ఈ డాక్యుమెంట్లలోని ఫొటోని మార్చి బ్యాంకుల దగ్గరకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, బ్యాంకులు గుర్తించలేకపోతున్నాయి. ఈ డేటాను ఉపయోగించి మోసగాళ్లు లోన్లను కూడా తీసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థ  సెంట్రల్ కేవైసీలోని డేటా సరిపోల్చి క్రాస్ చెక్ చేయడానికి వీలుంటుంది. కానీ, కేవలం రెగ్యులేటెడ్ కంపెనీలు మాత్రం ఫీజు చెల్లించి ఈ సంస్థను యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. కేవైసీ స్టార్టప్‌‌లు డేటా అథంటికేషన్‌‌ను చెక్ చేయడానికి సీకేవైసీ లేదా ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌ లేదా యూడీఏఐ నుంచి డేటాను తీసుకోలేవు. ఫలితంగా ఫైనాన్షియల్ సంస్థలు సేకరించిన డేటాను అథంటికేషన్ కోసం స్టార్టప్‌‌లు వాడుతున్నాయి.  కేవైసీ స్టార్టప్‌‌లు ఫైనాన్షియల్ సంస్థల దగ్గర ఉన్న డాక్యుమెంట్లలోని టెక్స్ట్‌‌ను ముందు సేకరిస్తాయి. తర్వాత కస్టమర్ల సెల్ఫీని డాక్యుమెంట్లలోని ఫొటో గ్రాఫ్‌‌లతో సరిపోలుస్తాయి. ప్రభుత్వ రికార్డుల్లోని డేటాతో ఈ డాక్యుమెంట్లను పోలుస్తాయి. ఈ విధంగా స్టార్టప్‌‌లు కేవైసీ జరుపుతాయి. 2021లో వీడియో కేవైసీకీ ఆర్‌‌‌‌బీఐ అనుమతిచ్చింది. అందువలన అథంటికేషన్ కోసం ఈ ఆప్షన్‌‌ కూడా కేవైసీ స్టార్టప్‌‌లకు అందుబాటులో ఉంది. కస్టమర్ల నుంచి సేకరించిన డేటా స్టార్టప్‌‌లోని చాలా మందికి యాక్సెస్ చేయడానికి వీలుంటుందని స్లైస్ పేర్కొంది.  

చాలా కేవైసీ స్టార్టప్‌‌లు  కస్టమర్ల డేటాను స్టోర్ చేసుకుంటున్నాయని, అమ్ముకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. ఇది సాధారణం అయిపోయిందని  అంటున్నారు. ఉదా. ఈ–కేవైసీలో ఆధార్ డాక్యుమెంట్లను వెరిఫై  చేసేటప్పుడు స్టార్టప్‌‌లు యూఐడీఏఐకి, లెండర్లకు మధ్య వారధిలా పనిచేస్తాయి. ఈ విధానంలో డేటా యూఐడీఏఐ నుంచి లెండర్‌‌‌‌కు వెళుతుంది. అదే ఆఫ్‌‌లైన్‌‌లో చేసే ఆధార్ వెరిఫికేషన్‌‌, వీడియో కేవైసీ విధానంలో  డేటా లెండర్‌‌‌‌కు చేరిన తర్వాత కూడా స్టార్టప్‌‌ల దగ్గర ఉంటోంది. ఈ స్టార్టప్‌‌ల దగ్గర కస్టమర్ల డేటా ఉండకూడదు. ఎందుకంటే లెండర్‌‌కు మాత్రమే తన డేటాను స్టోర్ చేయడానికి కన్జూమర్ పర్మిషన్ ఇస్తాడు. ఈ అంశాలన్నీ డేటా ప్రొటెక్షన్‌‌పై ఆందోళనలు పెంచుతున్నాయి. కైవైసీ స్టార్టప్‌‌లకు లైసెన్స్‌‌ ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. గ్లోబల్‌‌గా కూడా కేవైసీ స్టార్టప్‌‌లను రెగ్యులేట్ చేయడం లేదు కాబట్టి ఇండియాలో కూడా చేయడం కష్టమని కొందరు వాదిస్తున్నారు. ఇండస్ట్రీ మాత్రం కేవైసీకి సంబంధించి గైడ్‌‌లైన్స్ ప్రభుత్వం తెస్తుందని ఆశిస్తున్నాయి.