ఇవాళ మేనేజ్​మెంట్లతో భేటీ కానున్న టీఏఎఫ్​ఆర్సీ

ఇవాళ మేనేజ్​మెంట్లతో భేటీ కానున్న టీఏఎఫ్​ఆర్సీ

హైదరాబాద్, వెలుగు: టీఏఎఫ్​ఆర్సీ ఇదివరకే నిర్ణయించిన ఫీజులను ఒప్పుకోని 25 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ప్రతినిధులతో అధికారులు సోమవారం మరోసారి భేటీ కానున్నారు. 173 ఇంజినీరింగ్ కాలేజీల్లో 2022-25 బ్లాక్ పీరియడ్​కు ఫీజులను నిర్ణయించేందుకు టీఏఎఫ్​ఆర్సీ జులైలో మేనేజ్మెంట్లతో హియరింగ్ నిర్వహించింది. ఆడిటింగ్​లో తప్పులు దొర్లాయని గతనెలలో మరోసారి భేటీ కాగా.. 90కి పైగా కాలేజీల్లో ఫీజులు తగ్గాయి. ఫీజులు భారీగా తగ్గాయని 25 కాలేజీల వాళ్లు అభ్యంతరాలు తెలిపారు. దీంతో టీఏఎఫ్​ఆర్సీ పూర్తిస్థాయి కమిటీ వాళ్లతో సోమవారం భేటీ కానుంది. ఇందులో నిర్ణయించే ఫీజులే ఫైనల్ కానున్నాయి. ఈ 25 కాలేజీలతో పాటు ఇప్పటికే నిర్ణయించిన కాలేజీల ఫీజుల ప్రతిపాదనలను, ఎంబీఏ.. ఎంసీఏ ఫీజుల వివరాలనూ సర్కారుకు పంపించనున్నారు.