Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?

Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?

గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్న బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.  2024 ఏప్రిల్ 29వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్ల 10  గ్రాముల  బంగారం ధర రూ.  300 తగ్గి రూ. 66 వేల 550కి చేరుకుంది. ఇక  24  క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర రూ.  330 తగ్గి రూ. 72 వేల 930కి చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  66 వేల 700గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72వేల 750గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని మంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  67 వేల 400గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  73వేల 530గా ఉంది. 

హైదరాబాద్ విషయానికి వస్తే  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  66 వేల 550గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72వేల 600గా ఉంది. విశాఖపట్నంలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  66 వేల 550గా ఉండగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72వేల 600గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.  

Also Read:అక్క మంజులతో మహేష్ ఫన్ మూమెంట్.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

ఇక వెండి ధరలు గత రెండు రోజుల నుంచి స్థిరంగానే కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు ఎలాంటి మార్పు లేకుండా రూ. 87 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో రూ.  84 వేలుగా ఉంది.